Vijayabheri Sabha:తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలన్నది తన కల అని చెప్పారు. ఈ సందర్బంగా సోనియాగాంధీ తెలంగాణకు ఆరు గ్యారంటీ పధకాలను ప్రకటించారు. అవి
1. మహాలక్ష్మి పథకం..
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500
పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
2. రైతు భరోసా..
ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు
వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు
వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్
3. ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం
4.గృహజ్యోతి పథకం
గృహజ్యోతి పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
5. చేయూత పథకం
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా
చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్
6.యువ వికాసం
యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం.
ఆ మూడు పార్టీలు కలిసే ఉంటాయి.. (Vijayabheri Sabha)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజకీయాల్లో ఎవరితో పోరాటం చేస్తున్నామో మనకు తెలిసి ఉండాలని అన్నారు. తెలంగాణలో కేవలం బీఆర్ఎస్‌తో మాత్రమే కాంగ్రెస్ పోరాడటం లేదు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతోనే కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు.ఇవన్నీ వేర్వేరు పార్టీలని చెప్పుకుంటాయని . కానీ బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు కలిసి ఉంటాయన్నారు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలను నేను చూశాను. బీజేపీకి అవసరమైనప్పుడు బీఆర్ఎస్ పూర్తి మద్దతిచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. రైతు బిల్లులపై మోదీ సైగకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిందని అన్నారు. తెలంగాణ గురించి ఆలోచన చేస్తామని 2012లోనే చెప్పారుప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేసారు.