Vangaveeti Radhakrishna: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 22 వ తేదీన ఆయన నరసాపురానికి చెందిన పుష్పవల్లిని పెళ్లాడబోతున్నారు. రాధాకృష్ణకు సెప్టెంబర్ 3న నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణి ల కుమార్తె పుష్పవల్లితో నిశ్చితార్దం జరిగిన విషయం తెలిసిందే. విజయవాడ పోరంకిలోని మురళి రిసార్టులో 22 వ తేది రాత్రి 7.59 నిమషాలకు వీరి వివాహం జరగనుంది.
విజయవాడ సెంట్రల్ నుంచి..( Vangaveeti Radhakrishna)
ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధాకృష్ణ వచ్చే ఎన్నికల్లొ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణ 2004లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేరు. మరోవైపు ఆయన జనసేన పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి.