Site icon Prime9

YSR Congress : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. 8 జిల్లాలకు కొత్త అధ్యక్షులు

YSR Congress

YSR Congress

Andhra Pradesh News: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 8 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్మాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలు సార్లు సమీక్షనిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లని గ్రామాల్లో తిరగని వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు. ఈ నేపధ్యంలోనే తాజా మార్పులు వచ్చాయని తెలుస్తోంది.

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం ఉన్న కుప్పం జిల్లాకు అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని నియమించారు. అంతకు ముందు ఆ జిల్లాకు ఎమ్మెల్సీ భరత్ అధ్యక్షుడిగా ఉన్నారు. బాపట్ల కో ఆర్డినేటర్ బాధ్యతను పార్లమెంట్ సభ్యుడైన బీద మస్తాన్‌రావుకు, పల్నాడు ను ఎమ్మెల్యే భూమనకు అప్పగించారు. గుంటూరు కో ఆర్డినేటర్ బాధ్యతను మర్రి రాజశేఖర్ కు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలను పార్లమెంట్ సభ్యుడైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి అప్పగించారు. విజయనగరం జిల్లాకు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిని, అల్లూరి జిల్లాకు మంత్రి బొత్స సత్యనారాయణను నియమించారు.

శాసన సభ్యులు పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, వై.బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను వారి జిల్లా అధ్యక్షుల పదవుల నుంచి తొలగించారు.వీరితో పాటు రీజినల్ కో ఆర్డినేటర్ లుగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని, మరో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌లను బాధ్యతల నుంచి తప్పించారు.పార్టీలో, ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న మరి కొందరు రీజినల్ కో ఆర్డినేటర్లను తొలగించింది. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డిను రీజినల్ కో ఆర్డినేటర్ గా కొనసాగిస్తున్నారు. ఆయనకు ఇప్పటికే ఉన్న నెల్లూరు జిల్లాలో పాటు అదనంగా వైఎస్సార్, తిరుపతి జిల్లాలను కూడ అప్పగించారు.

Exit mobile version