V.Hanumantha Rao Comments: షర్మిలపై విహెచ్ కీలక వ్యాఖ్యలు

ఏపీ వెళ్లి జగన్ పై పోరాడామని తాను గతంలోనే షర్మిలకు సూచించానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి .హనుమంతరావు అన్నారు .తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజీవ్‌ గాంధీ కళాశాలలో అమలా పురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో కలిసి అయన విలేకరులతో మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 04:25 PM IST

V.Hanumantha Rao Comments: ఏపీ వెళ్లి జగన్ పై పోరాడామని తాను గతంలోనే షర్మిలకు సూచించానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి .హనుమంతరావు అన్నారు .తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజీవ్‌ గాంధీ కళాశాలలో అమలా పురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో కలిసి అయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మరొక ఐదేళ్లలో పరిస్థితులన్నీ సర్దుకుని కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందన్నారు. మూడేళ్ల క్రితమే షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఈ సందర్భంగా వి .హనుమంతరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని నెలకొల్పాలని భావించారు .దీని కోసం రాజమహేంద్రవరంలో విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు . విగ్రహా పనులను పరిశీలించదానికి రాజమహేంద్రవరం వచ్చారు వి.హనుమంతరావు . విగ్రహ శిల్పి వడయార్‌ను కలిసి విగ్రహాన్ని పరిశీలించారు .

ఎన్‌డీఏ అవుట్‌..(V.Hanumantha Rao Comments)

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి తన అన్న జగన్‌తో తేల్చుకోవాలని గతంలోనే తాను షర్మిలకు సూచించానని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఎన్‌డీఏ అవుట్‌ కావడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి‌పై ప్రధాని మోదీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.ఓటమి భయంతోనే మోదీ అయోధ్య లాంటి అంశాలు లేవనెత్తుతున్నారని ఆరోపించారు .ఇప్పటి వరుకు జరిగిన పోలింగ్ లో ఇండియా కూటమికే మొగ్గు ఉందని చెప్పారు .