Site icon Prime9

Kishan Reddy Arrest: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే.

Kishan Reddy Arrest

Kishan Reddy Arrest

Kishan Reddy Arrest: హైదరాబాద్ నగర శివార్లలోని బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలని పరిశీలించేందుకు వెళుతున్నకేంద్రమంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఓఆర్ఆర్‌పై తుక్కుగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడిరోడ్డుపై కిషన్ రెడ్డితోపాటు ఇతర బిజెపి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కిషన్ రెడ్డి తదితరులని అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయానికి తరలించారు. బిజెపి పిలుపునిచ్చిన చలో బాటసింగారానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ వ్యాప్తంగా బీజేపీ నేతలని ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. ఈటల రాజేందర్‌తోపాటు పలువురు అగ్రనేతలని ఇంటినుంచి కదలకుండా కట్టడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

నేను ఉగ్రవాదినా? ..(Kishan Reddy Arrest)

బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపై రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసలు తెలంగాణ ఎటు పోతోందని ఆయన ప్రశ్నించారు. తానేమైనా ఉగ్రవాదినా..? లేక ఏనాడైనా చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తినా..? ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. విమానాశ్రయం నుంచి పోలీసులు తనను ఎందుకు వెంబడించారని నిలదీశారు. కనీసం మానవత్వం లేకుండా.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. రెండేళ్ళలో ప్రగతి భవన్ పూర్తయిందని. తొమ్మిదేళ్లయినా డబుల్ బెడ్ రూమ్‌లు పూర్తికాని పరిస్దితి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. దీనిని బట్టి పేదలపట్ల బీఆరెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతోందని అన్నారు.

తెలంగాణలో బిజెపి నేతల అరెస్టులపై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ? ఎన్ని డబుల్ బెడ్ రూములు ఇళ్లను పేదలకు ఇచ్చారో లెక్క చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో బయటపెట్టాలని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల లిస్టు విడుదల చేయటం లేదని బండి సంజయ్ ఆరోపించారు.

మరోవైపు బీజేపీ రాష్ట్రా అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిందేమీ లేదని మంత్రి విమర్శించారు. కిషన్ రెడ్డి డబుల్ బెడ్రూం ఇళ్లు చూస్తానంటే.. తానే స్వయంగా చూపిస్తానన్నారు. బీజేపీ నేతలు ఇప్పుడు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపకం ఆలస్యం అయిన మాట వాస్తవమేనని.. కొత్త హంగులతో ప్రజలకు ఇవ్వాలన్నదే తమ విధానమని ఆయన వివరించారు.

Exit mobile version