Site icon Prime9

Professor Haragopal: ప్రొఫెసర్ హరగోపాల్ సహా 152మందిపై ఉపా చట్టంకింద కేసు

Professor Haragopal

Professor Haragopal

Professor Haragopal:తెలంగాణకి చెందిన 152మంది పౌరహక్కులు, విప్లవ సంఘాల బాధ్యులు, మేధావులపై ఉపా చట్టంకింద కేసు నమోదయింది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ లో ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి. వీరిలో పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బీరెల్లి గ్రామం వద్ద ఆరోజు తెల్లవారుజామున మావోయిస్టు పార్టీ సభ్యులు కొంతమంది సమావేశామవుతున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు.

పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారుల పేర్లు..(Professor Haragopal)

పోలీసులు రావడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. అక్కడ పోలీసులు తనిఖీలు చేసి విప్లవ సాహిత్యాన్ని, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారుల పేర్లు ఉండటంతో వారిని నిందితులుగా చేర్చారు. ప్రభుత్వాన్ని కూలదోయడానికి, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులను హత్య చేయడానికి వీరంతా మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర చేసినట్లు పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

Exit mobile version