TTD: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. మరోసారి కలకలం రేపిన టీటీడీ ఫేక్ వెబ్ సైట్

తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి నకిలీ వెబ్ సైట్ బయటపడింది. తాజాగా టీటీడీ నకిలీ వెబ్ సైట్ ను అధికారులు గుర్తించారు.

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి నకిలీ వెబ్ సైట్ బయటపడింది. తాజాగా టీటీడీ నకిలీ వెబ్ సైట్ ను అధికారులు గుర్తించారు. ఈ విషయం ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే టీటీడీ పేరుతో 40 నకిలీ వెబ్ సైట్లను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారు. తాజాగా మరొకటి బయటపడింది. దీందో మొత్తం కేసులు 41 కి చేరాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏపీ ఫోరెన్సిక్ సెల్ కు కేసును అప్పగించారు. సైబర్ సెల్ అధికారులు వెబ్ సైట్ పై విచారణ ప్రారంభించారు. టీటీడీ అధికారికి వెబ్ సైట్ లో కొన్ని మార్పులు చేసి ఫేక్ వెబ్ సైట్ లను తీసుకొస్తున్నారని టీటీడీ పేర్కొంది.

 

భక్తులు అప్రమత్తంగా ఉండాలి(TTD)

https ://tirupatibalaji.ap.gov.in/ పేరుతో టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ఉండగా.. దానికి చిన్న మార్పులు చేసి https ://tirupatibalaji-ap-gov.org/ పేరుతో ఫేక్‌ వెబ్‌సైట్ ను రూపొందించారు. అయితే నకిలీ వెబ్ సైట్లతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కోరింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారానే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని సూచించింది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను ‘టీటీడీ దేవస్థానమ్స్’(TTDevasthanams) కూడా వినియోగించవచ్చని వెల్లడించింది. నకిలీ వెబ్ సైట్లు మరోసారి వెలుగులోకి రావడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు.

 

వైభవంగా చందనోత్సవం.. భారీగా భక్తుల రద్దీ(TTD)

సంవత్సరమంతా పూర్తిగా చందనం పూతలో ఉండే సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి వైశాఖ శుక్లపక్ష తదియ నాడు(ఆదివారం ) భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. చందనోత్సవంగా పిలిచే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వరాహ-నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాచలం అప్పన్న నిజరూపాన్ని కనులారా వీక్షించడం మహా భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో సింహాచలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులు ఎత్తేశారు. ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర తోపులాట జరిగింది. 1500 రూపాయల లైన్లోకి పంపుతుండగా తొక్కిసలాట జరిగింది. భక్తులను నియంత్రిచడంలో అధికారులు, పోలీసులు విఫలమయ్యారు. తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.