Site icon Prime9

TTD: టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయాలు ఇవే

TTD

TTD

TTD: బుధవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు కనీసం 20 వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పోటు కార్మికులకు 10వేల రూపాయల చొప్పు జీతం పెంచాలని ఆదేశించారు.

టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు..(TTD)

వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్‌గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. చిన్నజీయర్ , పెద్ద జీయర్ మఠాల నిర్వహణ, ఉద్యోగుల ఉద్యోగ భద్రతకోసం అదనంగా ఏటా కోటి రూపాయల సహాయం చేయాలని నిర్ణయించారు. వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల పెంచాలని తీర్మానించారు. ఎల్లుండి అంటే డిసెంబరు 28వ తేదీన 3,500 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు పత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం మరో 350 ఎకరాల భూమి కొనివ్వాలని నిర్ణయించారు. మరో వారం పది రోజుల్లో ఇంకో 1500 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.జార్ఖండ్ లో 100 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. చంద్రగిరిలో మూలస్తానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ది పనులకోసం రెండు కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version