Jogi Ramesh Land Grab Case: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. జోగి రమేష్ భూ దందాలో రికార్డులు తారుమారు చెయ్యడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యుల భూ వివాదంలో ముగ్గురిపై వేటు పడింది. కలెక్టర్ కు తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణ కావటంతో ముగ్గురిపై సస్పెన్షన్ వేశారు.
అగ్రిగోల్డ్ భూముల కబ్జా..(Jogi Ramesh Land Grab Case)
డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య పై వేటు పడింది. నిషేధిత అగ్రిగోల్డ్ భూములకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సర్వే నంబరు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్టు విచారణలో బయటపడడంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు. జోగి రమేష్ కబ్జా చేసింది .. అమ్మేసింది అగ్రిగోల్డ్ ఆస్తి. స్వయంగా అగ్రిగోల్డ్ యజమానులే కొత్త పేట పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేశారు. జోగి రమేష్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా తమదే అనుకున్నారు… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుంది కాబట్టి… ఖాతాల్లో కలిపేసుకోవడం సులువు అనుకున్నారు. ప్రభుత్వం మారిపోవడంతో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి కూడా అవకాశం లేనంత పబ్లిక్ గా కబ్జా చేసి అమ్ముకున్నారు జోగి రమేష్.
ఈ కబ్జా కేసులో జోగి రమేష్ తో పాటు ఆయన కుమారుడు, బాబాయి ప్రత్యక్షంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అగ్రిగోల్డ్ భూములు కబ్జాలో గ్రామ సచివాలయం సర్వేయర్, మండల సర్వేయర్, మండలం డిప్యూటీ తహసిల్దార్, సబ్ రిజిస్టార్ కీలకంగా వ్యవహిరించారు అనేది ప్రధాన ఆరోపణలు. కొత్త పేట పోలీస్ స్టేషన్లో 2023 మార్చ్ 3న అవ్వా వెంకట రామారావు కుటుంబ సభ్యులు ఈ కబ్జాపై పిర్యాదు చేశారు. అప్పటి నుండి పోలీసులు గాని సిఐడి అధికారులు గాని కేసు నమోదు చెయ్యలేదు. విచారణ కూడా చేయలేదు. రెవిన్యూ అధికారులపై వేటు పడినా…. కేసు మాత్రం నత్తనడకన నడుస్తోంది.