Leaders Yatra: ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. మరో వైపు అగ్రనేతలు మాత్రం యాత్రలకు బయలుదేరారు . ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా తీర్థయాత్రలు చేస్తున్నారు. మహారాష్ట్ర లోని పుణ్య క్షేత్రాలను చుడుతున్నారు . ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కు హాజరైన చంద్ర బాబు నాటి నుంచి యాత్రలు చేస్తున్నారు .
యూరప్ యాత్రకు జగన్..(Leaders Yatra)
మరో వైపు సీఎం జగన్ శుక్రవారం ఉదయం విదేశాలకు వెళ్లనున్నారు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్‌కు ఆయన సతీసమేతంగా వెళ్తున్నారు.జగన్ కుమార్తెలు లండన్ లో విద్యాభాసం చేస్తుండడం తెలిసిందే .కుటుంబ సమేతంగా యూరప్ యాత్రకు జగన్ బయలు దేరుతున్నారు.ఈ మేరకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్ట్ కూడా అనుమతి మంజూరు చేసింది .
రష్యా వెళ్లనున్న పవన్..
జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా సతీసమేతంగా రష్యాకు వెళ్తున్నట్టు సమాచారం. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. అక్కడే కాశీ విశ్వనాధుని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం ఆయన రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో జరిగిన ఎన్నికల హింస , రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రుతుపవనాలు వస్తున్న నేపథ్యంలో కాల్వల పూడికలు తీయించాలని ,అదేవిధంగా ఎన్నికల అనంతరం జరిగిన హింసను అరికట్టాలని ఆయన ఆ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు .