Site icon Prime9

TPCC President Revanth Reddy: సచివాలయం గేట్లు అందరికీ తెరిచి ఉంటాయి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

TPCC President Revanth Reddy: ప్రగతి భవన్ పేరును ఇకపై బిఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అద్బుతమైన తీర్పు ఇచ్చారంరటూ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం గేట్లు ఇకపై సాధారణ ప్రజలకు కూడా తెరిచి ఉంటాయని చెప్పారు.

అందరూ సహకరించారు ..(TPCC President Revanth Reddy)

డిసెంబర్ 3 వ తేదీన అమరుడయిన శ్రీకాంత చారికి ఈ ప్రజాతీర్పును అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఎంతగానో కష్టపడితేనే ఈ విజయం లభించిందని అన్నారు. సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలతో కలిసి ముందుకు వెడతామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును శిరసావహించాలని అన్నారు. బీఆర్ఎస్ కొత్త ప్రభుత్వానికి సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తనకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచిన రాహుల్ గాంధీకి, ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీకి దన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్ రావ్ ధాక్రే, ఏఐసిసి సెక్రటరీలు నెలల తరబడి ఇక్కడే మకాం వేసి కాంగ్రెస్ విజయానికి కృషి చేసారని చెప్పారు. ఈ విజయంలో 30 లక్షలమంది నిరుద్యోగుల పాత్ర కీలకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ విజయానికి తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నం : రేవంత్ రెడ్డి  | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar