Site icon Prime9

AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే..

AP Cabinet Meeting

AP Cabinet Meeting

AP Cabinet Meeting: సోమవారం సుమారుగా మూడు గంటల పాటు చర్చించిన ఏపీ కేబినేట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్.. అన్నిటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.

5 హామీల అమలుకు ఆమోదం..(AP Cabinet Meeting)

ఈ సమావేశంలో మెగా డీఎస్సీతో పాటు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అలాగే గతంలో ఉన్న అన్న క్యాంటీన్లును పునరుద్దరిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఇక సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ సెన్సెస్‌కు సైతం కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇక గతంలో వివాదాస్పదం అయిన వైఎస్సార్ హెల్త్ వర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.సమావేశంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైన చర్చించారు. కార్పొరేషన్ల పునరుద్దరణ, వాటికి నిధుల సమీకరణ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్థి, , ఉచిత ఇసుక వంటి అంశాలపై కూడా చర్చించారు. ఏడు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్స్, విద్యుత్ శాఖలపైనా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version