Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. ప్రజా సమస్యల్ని అధికారులు, నేతలు పట్టించుకోవడం లేదని.. 20వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రామరాజు చెప్పుతో కొట్టుకున్నాడు. ప్రజల సమస్యలు తీర్చలేనప్పుడు కౌన్సిలర్‌గా ఉండి ఏం లాభమని ఆవేదన వ్యక్తం చేశాడు. మరణించడం తప్ప.. తనకు వేరే మార్గం లేదని కౌన్సిలర్ రామరాజు కంటతడి పెట్టుకున్నాడు.
మౌళిక సదుపాయాలు లేవు..(Narsipatnam)
తాను కౌన్సిలర్ గా గెలిచినా కనీస మౌళిక సదుపాయాలను కల్పించలేకపోతున్నానని రామరాజు అవేదన వ్యక్తం చేసాడు. వీధిలైట్లు, కుళాయిలు, రోడ్లు ఏమీ లేవని చివరకు చెత్త బండిని కూడా పంపించడం లేదని అన్నాడు. కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిలర్ గా ఉండటం వలనే ఇలా జరుగుతోందన్నాడు. ఇది ఖర్మ అంటూ కన్నీరు పెట్టుకుని తనను తాను చెప్పుతో కట్టుకున్నాడు. అతను చేసిన పనికి ఒక్కసారిగా అందరూ నివ్వెరపోయారు. అనంతరం టీడీపీ సభ్యులు ఛైర్ పర్సన్ ను చుట్టుముట్టడంతో గందరగోళం రేగింది. దీనితో సమావేశాన్ని వాయిదా వేసారు.