Site icon Prime9

Bandaru Satyanarayana Murthy: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత

Bandaru

Bandaru Satyanarayana Murthy: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నలపాలెంలోని మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద అర్థరాత్రి 11 గంటల తరువాత తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. భారీగా పోలీసులు వారింటివద్ద మోహరించారు. బండారు సత్యనారాయణ మూర్తికి 41 ఏ నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

డీజీపీకి లేఖ రాసిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్..(Bandaru Satyanarayana Murthy)

బండారు సత్యనారాయణను అరెస్టు చేస్తారన్నవిషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా వారింటివద్దకు తరలివచ్చారు. స్థానిక సినిమా హాల్ జంక్షన్ సబ్ స్టేషన్ దగ్గర ప్రహరీ గేట్లు ఏర్పాటు చేసి స్థానిక నాయకులను కార్యకర్తలను బండారు ఇంటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవల కాలంలో బండారు సత్యనారాయణమూర్తి వైకాపా మహిళా మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి రెండు రోజుల క్రితం లేఖ రాశారు. దీనిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆమె కోరారు.

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ ఇంటివద్ద ఉద్రిక్తత | TDP Leader Satyanarayana | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar