Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.ఇంటర్ ఫస్టియర్ లో ఉత్తీర్ణత శాతం 60.01 కాగా 12వ తరగతిలో 64.19 గాఉంది.
ఫిబ్రవరి 29 నుంచి మార్చ్ 19 వరకు జరిగిన పరీక్షల్లో సుమారు పది లక్షల మంది ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరు అయ్యారు. వీరిలో ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4.78 లక్షల విద్యార్థులు హాజరుకాగా.. 2.87 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ పరీక్షలకు మొత్తం 5.02 లక్షల మంది హజరవగా.. 3.22 లక్షల మంది పాసయ్యారు.ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల్లో బాలురతో పోల్చినపుడు బాలికల్లో ఉత్తీర్ణతా శాతం ఎక్కువగా ఉండటం విశేషం. ఇంటర్ మొదటి సంవత్సరం బాలికల్లో ఉత్తీర్ణత 68.35 శాతం, బాలురు 58.5 శాతంగా ఉంది. ఇంటర్ రెండవ సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణతా శాతం 56.1 శాతం ఉండగా బాలికల్లో 72,53 శాతంగా ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను tsbie.cgg.gov.in, అలాగే results.cgg.gov.inలో చూడవచ్చు.