Vundavalli Arun Kumar : బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీకి అయినా నేను ఓటు వేస్తానని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.బీఆర్ఎస్ వచ్చి పార్టీ పెట్టి బీజేపీని వ్యతిరేకిస్తాను అంటే మంచి అవకాశం ఉందంటే నా ఓటు వాళ్ళకే అంటున్నారు.కాంగ్రెస్, కమ్యునిస్టులు లేకపోతే నోటాకు ఓటు వేస్తానని అన్నారు.మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్‌లు వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని..స్పోక్స్‌మెన్‌గా కేసీఆర్‌తో సమానంగా ఎవరూ ఉండరని అభిప్రాయపడ్డారు.
పార్టీ విజయం సాధిస్తుందో ? లేదో లేదో తెలియదని.మాటలు మాత్రం ప్రజలకు చేరుకుంటాయని ఉండవల్లి అన్నారు.గతంలో కేసీఆర్ తనని పిలిచి మాట్లాడారని..అన్ని విషయాలు తనతో చెప్పారన్నారు…పార్టీ వైపుగా ఎందుకు ఇలా ఆలోచన చేశారో వివరించారని…జాతీయ పార్టీ పెట్టినా సరే కేసీఆర్ తెలంగాణను వదలరని..దేశంతో పాటూ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు.కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం కలిగింది అన్నారు.కేసీఆర్ రాజకీయాల విషయాల పై స్పష్టంగా ఉంటారని,అలాగే ఏ విషయమైన ముక్కు సూటిగా మాట్లాడగల వ్యక్తి అని అన్నారు అరుణ్ కుమార్అ భిప్రాయపడ్డారు.కేసీఆర్ ఎప్పుడు పిలిచినా ఆ పార్టీలోకి వెళతానని అన్నారు. కేసీఆర్ పిలిచినా పిలవకపోయినా తాను మాత్రం ఎప్పటికి బీజేపీకి వ్యతిరేకం అని అన్నారు.