Vinayaka Immersion 2023 : హైదరాబాద్ లో కన్నుల పండుగగా వినాయకుల నిమజ్జన వేడుక.. లైవ్

వినాయక చవితి వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలోనే నవరాత్రుల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడుని నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దం అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకులు విగ్రహాలను ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌ వైపు తీసుకువస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 11:49 AM IST

Vinayaka Immersion 2023 : వినాయక చవితి వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలోనే నవరాత్రుల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడుని నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దం అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకులు విగ్రహాలను ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌ వైపు తీసుకువస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మరోవైపు భక్తులు కూడా భారీ స్థాయిలో నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున తరలివస్తున్నారు.

ఈరోజు సుమారుగా జంట నగరాల వ్యాప్తంగా సుమారు 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగునుంది. ట్యాంక్‌బండ్‌తో పాటు పలు చెరువులు, రబ్బర్‌ డ్యామ్స్‌, బేబీ పాండ్స్‌లో నిమజ్జనాలు జరుగనున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ చుట్టూ 5 చోట్ల 36 భారీ క్రేన్లు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మూడు కమిషనరేట్ పరిధుల నుంచి 40 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మీకోసం ప్రత్యేకంగా అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం