Site icon Prime9

Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డు..రూ. 24 లక్షల 60వేలకు దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి

balapur-ganesh-laddu-auction

Hyderabad: బాలాపూర్ గణేష్ అన్నా, అక్కడి లడ్డు వేలం పాట అన్నా అందరూ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. బాలాపూర్ లడ్డూ చుట్టు సెంటిమెంట్లు ఉన్నాయి. ఈ లడ్డును చేజిక్కించుకుంటే నట్టింట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందనే విశ్వాసం ఉన్నాయి. దీనితో భక్తి, సెంటిమెంట్, ప్రెస్టీజ్ ఇష్యూగా బాలాపూర్ లడ్డూ వేలం మారింది.

కరోనా సమయంలో తప్ప 27 ఏళ్లుగా లడ్డూ వేలం పాటలో ప్రత్యేకత చూపిస్తూ, రాష్ట్ర ప్రజలందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది. ఈ ఏడాది కూడా ఘనంగా వేలంపాట నిర్వహించారు. లడ్డూను ఏకంగా 24 లక్షల 60 వేలు చెల్లించి పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ వస్తోంది.

ప్రతి ఏటా వేలంపాటలో వచ్చిన డబ్బంతా కలిపి కోటి 44 లక్షల 77 వేల రూపాయలను ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది. ఆ డబ్బునంతటిని గ్రామ అభివృద్ధి కోసమే వాడినట్లు వివరించారు.

Exit mobile version
Skip to toolbar