Site icon Prime9

Union Minister Kishan Reddy: కేసీఆర్‎ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. కిషన్ రెడ్డి

kishan-reddy-strong counter to-cm-kcr-speech-at-munugode

kishan-reddy-strong counter to-cm-kcr-speech-at-munugode

Hyderabad: కేసీఆర్‎ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, అందరూ తన వెనుక ఉన్నారనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని, అయితే అది అంత సులభం కాదన్నారు. అసలు కేసీఆర్‌ను జాతీయస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు.

ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణను ఉద్దరించానని దేశమంతా తిరిగి చెబుతున్నారు. బీహార్‌లో నిన్న కేసీఆర్ మాటలు వినలేక నితీష్కుమార్ లేచి వెళ్లే పరిస్థితి. తెలంగాణ రైతులు గోస పడుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అంటే తెలంగాణ రైతులను పట్టించుకోక పోవడమే తెలంగాణ మోడలా? అని కిషన్రెడ్డి ప్రశ్నించారు

Exit mobile version