Site icon Prime9

Union Minister Nirmala Sitharaman: తెలంగాణలో మూడు రోజుల పాటు నిర్మలాసీతారామన్ పర్యటన

Hyderabad: పార్లమెంట్ ప్రవాస్‌యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ నేటి నుంచి మూడురోజులపాటు జహీరాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు బీజేపీ వెల్లడించింది. మూడు, నాలుగో తేదీల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు.

పర్యటనలో భాగంగా పేద, బడుగు బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడం సహా వారికి అందుతున్న విధానాన్ని, కేంద్రమంత్రులు అడిగి తెలుసుకోనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల వినియోగం గురించి తెలుసుకోనున్నట్లు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో వివిధ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు.

Exit mobile version