TSRTC: హైదరాబాద్ మహిళలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టికెట్ రాయితీ ప్రకటించింది. టీ-24 టికెట్ ను రూ. 80 లకే అందిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం రూ. 100 లు ఉన్న టీ 24 టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ. 90 కి, సీనియర్ సిటిజన్లకు రూ. 80లకి టీఎస్‌ఆర్టీసీ తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకూ మరో రూ. 10 తగ్గించి రూ. 80లకే అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త టీ 24 టికెట్ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు.
మహిళలకు #TSRTC శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టి-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు… pic.twitter.com/swXIp035Xz
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 8, 2023
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో(TSRTC)
నగరంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే వారి కోసం టీ 24 టికెట్‌ను ఇటీవల ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్ తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే వీలు ఉంటుంది. టీ 24 టికెట్‌కు మంచి స్పందన లభిస్తోందని.. ప్రతి రోజు సగటున 25 వేల వరకు టికెట్లు అమ్ముడు పోతున్నట్టు ఇటీవల సజ్జనార్ వెల్లడించారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డనరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టీ 24 టికెట్ అందుబాటులో ఉంటుంది.