Site icon Prime9

Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు తప్పిన ప్రమాదం

sajjanar

sajjanar

Sajjanar: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీకి పెను ప్రమాదం త‌ప్పింది. సజ్జనార్‌ ప్రయాణిస్తున్న కారును ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. దానితో సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.

టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహారాష్ట్రకు వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం క్రాస్ రోడ్ వద్ద రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్ రహదారి పైకి అడ్డంగా దూసుకొచ్చింది. ఈ తరుణంలో సజ్జనార్‌ ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయపడగా, సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంట‌నే పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

కాగా ఆటో డ్రైవర్ తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంటున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: కూరలో ఉప్ప తక్కువైందని కట్టుకున్న భార్యను కడతేర్చాడు..!

Exit mobile version