TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌ నిర్ణయంపై ఉత్కంఠ.. ఏం చేయనున్నారంటే?

TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ వివాదం మరింతగా ముదరడంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగంలోకి దిగింది.

TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ వివాదం మరింతగా ముదరడంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగంలోకి దిగింది. ఈ మేరకు అత్యవసర సమావేశం కావాలని నిర్ణయించుకుంది.

చైర్మన్‌ అధ్యక్షతన సమావేశం (TSPSC Paper Leak)

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ వివాదం మరింతగా ముదరడంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగంలోకి దిగింది. ఈ మేరకు
అత్యవసర సమావేశం కావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నట్లు తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై కమిషన్‌ ప్రధానంగా చర్చించనుంది. సమావేశం అనంతరం.. ఈ ఘటనపై స్పందించే అవకాశం ఉంది. మరీ ఈ పరీక్షను రద్దు చేస్తారా.. లేదా మరేదైన నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో టీఎస్‌పీఎస్‌సీ భవనం దగ్గర పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

ఇక నిరసనలతో అరెస్ట్ అయి.. బేగంబజార్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన తెలంగాణ జనసమితి విద్యార్థి నాయకులను ప్రొఫెసర్‌ కోదండరాం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ పై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. గతంలో జరిగిన ప్రశ్నాపత్రాలు అన్నింటిపై సమీక్ష జరపాలి కోరారాయన.

టీఎస్ పీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

పేపర్ లికేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ను సస్పెండ్‌ చేయాలని కోరుతూ యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పేపర్‌ లీకేజీ వ్యవసహారాన్ని సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ బోర్డును ధ్వంసం చేశారు. కార్యాలయం లోపలికి విద్యార్థి సంఘాల నాయకులు చొచ్చుకెళ్లడంతో.. పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిందితుడి ఫోన్లో నగ్న ఫోటోలు..

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు.. మిగతా వారికోసం గాలిస్తున్నారు. ఇక ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్‌ 2017నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జూనియర్‌ అసిస్టెంట్‌ గా చేరాడు. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్‌ విభాగంలో విధులు నిర్వహిస్తు.. అక్కడికి వచ్చే మహిళల ఫోన్ నంబర్ల తీసుకునేవాడని తెలిసింది. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి వారితో సాన్నిహిత్యంతో పాటు.. పలువురు మహిళలలో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి మెుబైల్ లో ఎక్కువగా మహిళల నంబర్లు, మహిళల నగ్న ఫొటోలు, న్యూడ్‌ చాటింగ్‌లు ఉండడాన్ని గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్‌ అయిందని పోలీసులు తేల్చారు.

మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు

ప్రవీణ్ మరికొన్ని పేపర్లను లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని ఈ నెల 2న రూ.5 లక్షలు ఇచ్చిన రేణు, ఆమె భర్త.. మరోసారి 6న తేదీన ప్రవీణ్‌ను కలిసి ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్‌పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌ లో టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష పేపర్‌ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ఇక నిందితుడు ప్రవీణ్.. గ్రూప్‌-1 పరీక్ష రాసినట్లు వెల్లడైంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్‌ రాసిన పేపర్‌తో పాటు అతడికి వచ్చిన కోడ్‌ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. పేపర్‌ లీక్‌ అయిందా? లేదా? అనే కోణంలో సైబర్‌ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అసలు ప్రవీణ్‌కి 150కి గానూ 103 మార్కులు వచ్చేంత ప్రతిభా పాటవాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.