TS Election Schedule: తెలంగాణలో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అధికారులకు వరుసగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 5 నుంచి 10 వరకూ ఈసీ మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ అందించనున్నారు. ఓటర్ల నమోదు తో మొదలు కొని పోలింగ్, ఓట్ల లెక్కింపు.. ఇలా ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తారు.
అదే విధంగా 3 సంవత్సరాలుగా ఒకే దగ్గర పని చేస్తున్న అధికారుల బదిలీలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఎన్నికలకు సంబంధం ఉండే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్‌లతో పాటు కింది స్థాయి సిబ్బంది బదిలీలు జులై 31 లోపు పూర్తి కానున్నాయి. ఇక నవంబర్‌లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.99 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కూడా నిర్విరామంగా కొనసాగుతోంది. దీంతో ఓటర్ల సంఖ్య మరింత పెరగనున్నట్టు తెలుస్తోంది.