TS EAMCET 2023: తెలంగాణలో ఎంసెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ కు సంబంధించి నోటిఫికేషన్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు.
ఫిబ్రవరి 28 న ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జెఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
షెడ్యూల్ వివరాలివే..(TS EAMCET 2023)
మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తులో మార్పులు ఏప్రిల్ 12 నుంచి 14 చేసుకునేందుకు సమయం ఇచ్చారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్న్టు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
ఇంజనీరింగ్ కు సంబంధించిన పరీక్షలు మే 7 నుంచి 9 వరకు జరుగుతాయి. మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షలు మే 10, 11 తేదీల్లో నిర్వహిస్తారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగుతుంది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ రుసుము రూ. 500 కాగా, ఇతర విద్యార్థులకు రూ. 900
లుగా ఫీజు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ ఎంసెట్ వెబ్ సైట్ చూడొచ్చు.
విడుదలైన పీజీ ఈసెట్ షెడ్యూల్
అదేవిధంగా పీజీ ఈసెట్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 28న ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. లేట్ ఫీజుతో మే 24 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు.
మే 21 నుంచి పీజీ ఈసెట్ హాల్ టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరుగనున్నాయి.