Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Telangana Budget 2023: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా.. ప్రగతిశీల రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా.. వార్షిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మెుత్తం 2.90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Telangana Budget 2023: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా.. ప్రగతిశీల రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా.. వార్షిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మెుత్తం 2.90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

సబ్బండ వర్గాల అభివృద్దే ధ్యేయంగా.. అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ.. బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అన్ని సామాజిక వర్గాలకు అనుగుణంగా.. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు భేదం లేకుండా కేటాయింపులు చేసినట్లు మంత్రి తెలిపారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యుస్ చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌ర్వీసుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అలాగే సెర్ఫ్ ఉద్యోగుల‌కు పే స్కేల్ స‌వ‌ర‌ణ చేయ‌నున్నట్లు మంత్రి సభా వేదికగా ప్రకటించారు.

ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు.. నూతన ఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు.

ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్..

బడ్జెట్ సందర్భంగా.. పేదలకు మంత్రి శుభవార్త చెప్పారు. ఇల్లు లేని పేదలు.. సొంత జాగా ఉంటే వారికి రూ. 3 లక్షల సాయం అందిస్తామని తెలిపారు.

కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తెలిపారు. దీనికోసం రూ.7,890 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

ఆసరా పెన్షన్ల నిధులు పెంపు..

వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఆసరా పెన్షన్లను నిధులకు ప్రభుత్వం పెంచింది.

గత ప్రభుత్వాలు.. రూ. 200 ఫించన్ ఇవ్వగా దానిని తెరాస ప్రభుత్వం ఏకంగా రూ. 2016 కు పెంచింది. దివ్యాంగులకు రూ. 3016 పెన్షన్ అందిస్తోంది.

ఇంత ఎక్కువగా పెన్షన్ అందించే రాష్ట్రం తెలంగాణ మినహా మరే రాష్ట్రం లేదని మంత్రి అన్నారు.

ఈ పథకానికి గత సంవత్సరం.. రూ,11,728 కోట్లు కేటాయించగా ఇప్పుడు ఆ మెుత్తాన్ని రూ.12000 కోట్లకు పెంచింది.

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్..

రాష్ట్ర ప్ర‌భుత్వం కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ బడ్జెట్ Telangana Budget 2023లో ఈ పథకానికి నిధులు పెంచారు.

గ‌త బ‌డ్జెట్‌లో 2,750 కోట్లు కేటాయించ‌గా.. ఈ సారి 3,210 కోట్లు కేటాయించారు. బీసీల‌కు రూ. 2 వేల కోట్లు.. ఎస్సీల‌కు రూ. 500 కోట్లు కేటాయించారు.

మైనార్టీలకు అండగా ఉండేందుకు.. రూ. 450 కోట్లు.. గిరిజ‌నుల‌కు రూ. 260 కోట్లు కేటాయించారు.

కుల‌మ‌తాల‌కు అతీతంగా పేదింటి ఆడ‌బిడ్డలకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రూ. 1,00,116 ఆర్థిక సాయం అందిస్తుంది.

ఈ ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 12 ల‌క్షల 469 మంది ఆడ‌పిల్ల‌ల‌కు సాయం అందిందని తెలిపారు.

స్థానిక సంస్థలకు గుడ్ న్యూస్..

2023-24 బడ్జెట్ సందర్భంగా.. స్థానిక సంస్థలకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ వినిపించారు.

ఈ ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, ప‌ల్లె ప్ర‌గ‌తి నిధుల‌తో పాటు ఫైనాన్స్ క‌మిష‌న్ నిధుల‌ను కూడా స్థానిక సంస్థ‌ల ఖాతాల్లోకి నేరుగా బ‌దిలీ చేయాల‌ని సీఎం నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.

ఈ సంస్క‌ర‌ణ వ‌ల్ల స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు ఫైనాన్స్, ట్రెజ‌రీల ఆమోదం కోసం వేచి చూడ‌కుండా, స్వ‌తంత్రంగా నిధులు వినియోగించుకునే అవ‌కాశం క‌లుగుతుంద‌న్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/