Site icon Prime9

TRS-PK Survey: గులాబీ పార్టీలో ’పీకే‘ టెన్షన్

trs-pk-survey

Hyderabad: ఏడాది కాలంగా గులాబీ బాస్ కేసీఆర్ పూర్తి స్థాయిలో పార్టీపై ఫోకస్ పెట్టారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు పై సర్వేలు చేయిస్తున్నారు. మూడో సారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ తన ఐప్యాక్ టీమ్ తో విస్తృతంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. అవి ఎప్పటికప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ చేరవేస్తున్నారు. ఇప్పుడా నివేదికలు ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ శాసన సభాపక్షం సమావేశంలో సిట్టింగ్ లకే సీట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించినా ఎమ్మెల్యేల్లో మాత్రం భయం తగ్గలేదట. ఎమ్మేల్యేలు ఎవరు ఇతర పార్టీల్లోకి గోడ దూకకుండా అడ్డుకునేందుకే సిట్టింగ్ లకు సీట్లు ఇస్తానని ప్రకటించి ఉంటారన్న భావనలో ఎమ్మేల్యేలు ఉన్నారట. కేసీఆర్ ఏది మొదలు పెట్టాలన్నా ముందు ప్రజల నాడిని అంచనా వేస్తారు. అందుకోసం సర్వేలు చేయించటం..వాటి ఫలితాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళుతుంటారు. దీన్ని బట్టి కేసీఆర్ సర్వేల ఆధారంగానే టికెట్లు ప్రకటిస్తారనే అభిప్రాయంతో మెజార్టీ ఎమ్మేల్యేలు ఉన్నారట.

పీకే సర్వేలు అంటే హడలెత్తిపోతున్న ఎమ్మెల్యేలు ఆయన సర్వేలను తప్పు బడుతున్నరట. ఆయన ఇచ్చే సర్వే రిపోర్టులు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇక రోజూ ప్రజలతో మమేకమై తిరుగుతున్న తమకు ప్రజల నాడి తెలుసని, పీకే సర్వేలు ఎందుకని ఎమ్మేల్యేలు గొణుక్కుంటున్నారట. తాము ప్రజాబలంతో గెలిచి వచ్చామని, ఇప్పుడు పికె ఇచ్చే రిపోర్టులు తమ రాజకీయ భవిష్యత్ ను ప్రమాదంలోకి నెట్టెలా ఉన్నాయని తెగ హైరానా పడుతున్నారట ఎమ్మేల్యేలు. మొత్తానికి కేసీఆర్ సిట్టింగ్ లకే సీట్లు ఇస్తానన్న, ఎమ్మెల్యేల్లో మాత్రం నమ్మకం లేకపోవటం ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version