Sadar Utsav : హైదరాబాద్ లో సదర్ ఉత్సవ్ మేళా.. ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడంటే ?

హైద‌రాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో "సదర్" కూడా ఒకటి. ఈ పండుగను దీపావళి ఉత్సవాల్లో భాగంగా పండుగ ముగిసిన రెండో రోజున నిర్వహిస్తారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఆనవాయితీగా వస్తుంది. దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరించే పండుగను పురస్కరించుకొని వివిధ

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 11:21 AM IST

Sadar Utsav : హైద‌రాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో “సదర్” కూడా ఒకటి. ఈ పండుగను దీపావళి ఉత్సవాల్లో భాగంగా పండుగ ముగిసిన రెండో రోజున నిర్వహిస్తారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఆనవాయితీగా వస్తుంది. దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరించే పండుగను పురస్కరించుకొని వివిధ రాష్ట్రాల నుంచి కూడా దున్నపోతులను ప్రదర్శనకు తీసుకు వస్తూ ఉంటారు.

నగరంలోని నారాయణగూడ లో గల వైఎంసీఏలో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి బుధవారం తెల్లవారు జామున 3 గంటల వరకు సదర్‌ ఉత్సవ్‌ మేళా జరగనుంది. ఏటా వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు తాజాగా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. సంబంధిత ట్రాఫిక్ అడ్వైజ‌రీని ప‌రిగణ‌లోకి తీసుకుని పౌరులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.

ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతాలు ఇవే (Sadar Utsav) ..

  • సదర్‌‌‌‌ మేళాకు వచ్చే వాహనాలను శాంతి థియేటర్‌‌‌‌, రెడ్డి కాలేజ్‌‌, మెల్కొటే పార్క్‌‌, దీపక్ థియేటర్‌‌‌‌ పార్కింగ్‌‌ ఏరియాల్లో పార్క్‌‌ చేయాల్సి ఉంటుంది.
  • బర్కత్‌‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. బర్కత్‌‌పురా క్రాస్ రోడ్స్, టూరిస్ట్ హోటల్‌‌ నుంచి మళ్లించనున్నారు.
  • కాచిగూడ క్రాస్ రోడ్స్‌‌ నుంచి వైఎంసీఏ రూట్‌‌లో వచ్చే వాహనాలను టూరిస్ట్‌‌ హోటల్‌‌ రోడ్‌‌లో దారి మళ్లింపు.
  • స్ట్రీట్ నంబర్‌‌‌‌ 8 నుంచి వైఎంసీఏ వైపు ప్రవేశం లేదు. రెడ్డి కాలేజ్‌‌ వద్ద బర్కత్‌‌పురా వైపు మళ్లీస్తారు.
  • బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌‌ నుంచి రెడ్డి కాలేజి వైపు వచ్చే వాహనాలకు ఎంట్రీ లేదు. నారాయణగూడ క్రాస్ రోడ్స్‌‌ మీదుగా మళ్లించనున్నారు.
  • ఓల్డ్‌‌ ఎక్సైజ్ ఆఫీస్‌‌ నుంచి వచ్చే వాహనాలను విఠల్‌‌వాడి మీదుగా మళ్లిస్తారు.
  • సికింద్రాబాద్‌‌ నుంచి కోఠి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నారాయణగూడ క్రాస్‌‌ రోడ్స్, బర్కత్‌‌పురా, బాగ్‌‌లింగంపల్లి, వీఎస్‌‌టీ, ఆర్టీసీ రోడ్స్‌‌ మీదుగా మళ్లించనున్నారు.
  • విఠల్‌‌వాడి క్రాస్‌‌ రోడ్స్ నుంచి వచ్చే వాహన ట్రాఫిక్‌‌ను భవన్స్‌‌ న్యూ సైన్స్‌‌ కాలేజ్‌‌, కింగ్‌‌కోటి మీదుగా మళ్లీంపు.
  • ఓల్డ్‌‌ బర్కత్‌‌పురా పోస్టాఫీస్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్‌‌ను క్రౌన్ కేఫ్‌‌, బాగ్‌‌ లింగంపల్లి వైపు మళ్లింపు.