Site icon Prime9

MLA purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు…

MLA

MLA

Munugode: ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేశారంటూ నమోదైన కేసులో అరెస్టైనముగ్గురు నిందితులను సిట్ బృందం విచారిస్తోంది. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహాయాజీ లను విడివిడిగా వేరు వేరు గదుల్లో ఉంచి విచారిస్తున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం లో ఎవరు ప్రలోభాల చేస్తే వచ్చారని ప్రశ్నిస్తున్నన్నారు. ముగ్గురు వెనుక ఉన్నది ఎవరని పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ లు ముందు ఉంచి వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్, మోహినాబాద్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. అయితే నిందితులు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది.

ఈకేసు దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారు.సభ్యులుగా న‌ల్ల‌గొండ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ క‌మ‌లేశ్వ‌ర్ సింగేన‌వ‌ర్‌, శంషాబాద్ డీసీపీ ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజన్ ఏసీపీ గంగాధ‌ర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి ఉన్నారు.

Exit mobile version