Janagama: కనికరం లేని ఓ కన్నతల్లి దారుణంగా ప్రవర్తించింది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను నిర్దాక్షిణ్యంగా రిజార్వాయర్ లో పడేసింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో జరిగింది. పసిపాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రాయితో కట్టి..
కనికరం లేని ఓ కన్నతల్లి దారుణంగా ప్రవర్తించింది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను నిర్దాక్షిణ్యంగా రిజార్వాయర్ లో పడేసింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో జరిగింది. పసిపాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పదిరోజుల పసికందును ఓ తల్లి బండరాయికి కట్టి జలాశయంలో పడేసింది. ఈ ఘటన అందరిని కలచివేసింది. జలాశయం వద్దకు బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఇది గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పసిపాప మృతదేహాన్ని బయటకు తీశారు. ఆడపిల్ల కావడంతోనే.. కన్న తల్లి ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.