Site icon Prime9

Formula E-Race: ఈ ఫార్ములా రేసింగ్ పై సాంగ్ రిలీజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. సర్ప్రైజ్ ఇచ్చిన సుప్రీం హీరో

formula e race

formula e race

Formula E-Race: తెలంగాణ ప్రభుత్వం ఈ ఫార్ములా రేసింగ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ నెల 11 న జరగనున్న ఫార్ములా రేసింగ్ పోటీలకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ప్రభుత్వం గట్టిగానే ప్లాన్ చేసింది. అందులో భాగంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనదైన శైలిలో అదిరిపోయే ప్రమోషన్ ఇచ్చారు.

అదిరిపోయిన తమన్ మాస్ బీట్స్

ఈవెంట్ ప్రమోషన్స్ కోసం తమన్ కవర్ సాంగ్ ను సిద్దం చేశారు. హైదరాబాద్ నేటివిటీకి తగ్గట్టుగా తమన్ మాస్, క్లాస్ బీట్స్ ని మిక్స్ చేసి మంచి సాంగ్ ఇచ్చారు. ఈ పాటలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం హైలైట్ గా నిలిచింది. వీరిద్దరూ కలసి “హైదరాబాద్ జాన్‌ దేఖో ఫార్ములా-ఈ(Formula E-Race)” అంటూ సాగే పాటకు చిన్నారులతో కలిసి స్టెప్పులేశారు. ఈ పాటను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ పాటకు లక్షల్లో వ్యూస్ వస్తుండగా.. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

ఫార్ములా ఈ రేస్ ఇదే మొదటిసారి

ముఖ్యంగా హైదరాబాదీల నుంచి ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగం అయినందుకు తమన్ కు.. మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్ములా ఈ రేసింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రేసింగ్ కోర్టును అధికారులు సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. ఇక ఇండియాలో మొదటిసారిగా జరుగుతున్న ఈ పోటీలపై ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ ఫార్ములా E రేసు హుస్సేన్ సాగర్ చుట్టూ 2.8- కిమీ ట్రాక్లో జరుగనుంది. ఇందులో మొత్తం 18 మలుపులు ఉంటాయి. 20,000 మంది ప్రేక్షకులు ఈ రేస్ ను చూసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఇందులో నాలుగు రకాల టికెట్లు అందుబాటులో ఉంటాయి. గ్రాండ్ స్టాండ్ ధర వెయ్యి రూపాయలుగా, చార్జ్ గ్రాండ్ స్టాండ్ టికెట్ ధర నాలుగు వేలుగా, ప్రీమియం గ్రాండ్ స్టాండ్ టికెట్ ధర ఏడు వేలు గా, ఏస్ గ్రాండ్ టికెట్ ధర 10,500 లుగా నిర్ణయించారు. అలాగే 1.25 లక్షల ఏస్ లాంజ్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

ప్రముఖుల సపోర్ట్..

అంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగ చైతన్య, పలువురు ప్రముఖులు ఫార్ములా ఈ రేసింగ్ గురించి మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ జరగనుండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ రేస్ నిర్వహణకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్‌ కో కంపెనీ సీఈవో అనిల్ చలం శెట్టిని కొనియాడారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లలో వీడియోను పోస్ట్ చేశారు.

Exit mobile version