Telangana Secretariat: తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
ఏపీ, తెలంగాణ లోని స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసందే. దీంతో తెలంగాణ లో ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది. దీంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ప్రారంభోత్సవ కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
ఆగమేఘాల మీద సచివాలయ పనులు(Telangana secretariat)
నూతన సచివాలయాన్ని ఆగ మేఘాల మీద పూర్తి చేసింది టీఎస్ సర్కార్. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి అయ్యాయి. అత్యున్నత టెక్నాలజీ ఉపయోగించడంతో పాటు తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నూతన సెక్రటేరియట్ ను తీర్చి దిద్దారు.
రాష్ట్ర సపచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 17 న ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. దేశంలోని రాజకీయ ప్రముఖులకు సైతం ఆహ్వానాలు అందించింది. ఇంతలోనే ఎమ్మెల్సీ కోడ్ రావడంతో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా వేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు
ఆంధ్రప్రదేశ్లో 3 పట్టభద్రులు, 2 టీచర్ ఎమ్మెల్సీ, 8 స్థానిక సంస్థల స్థానాలు, తెలంగాణలో 1 టీచర్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29 తో ముగియనుంది. స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేసే సభ్యుల పదవీ కాలం మే 1 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్ – ఫిబ్రవరి 16
నామినేషన్లకు చివరి తేది – ఫిబ్రవరి 23
పరిశీలన – ఫిబ్రవరి 24
విత్ డ్రాలు – ఫిబ్రవరి 27
పోలింగ్ – మార్చి 13
కౌంటింగ్ – మార్చి 16