Site icon Prime9

CM Kcr : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..

telangana cm kcr started palamuru - rangareddy proect

telangana cm kcr started palamuru - rangareddy proect

CM Kcr : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ముందుగా సీఎం కేసీఆర్‌.. మోటర్లను ఆన్‌ చేసి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌ లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి పట్టారు.

శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్‌ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ క్రమంలో కాళేశ్వరం రికార్డును బ్రేక్ చేసేలా 145 మెగావాట్ల కెపాసిటీ కలిగిన 9 బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. రోజుకు 3,200 క్యూసెక్కులు ఎత్తిపోయగల కెపాసిటీ ఉన్న ఈ పంపు ద్వారా రెండు టీఎంసీల నీటిని అంజనగిరి (నార్లాపూర్‌) జలాశయానికి తరలించి నిల్వ చేస్తారు.

ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.35 వేల కోట్లు ప్రభుత్వం ఇప్పటి వరకూ ఖర్చు చేసింది. కాగా ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాలో ఉన్న 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు 1200 గ్రామాలకు తాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ (CM Kcr) తో పాటు ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

2015 జూన్‌లో ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టగా.. మొదటి పంపు ప్రారంభానికి ఎనిమిదేళ్లు సమయం పట్టింది. ప్రతి రోజు 0.25 టీఎంసీల చొప్పున మొత్తం 2 టీఎంసీ నీటిని ఎత్తిపోస్తారు. మొదటి దశలో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రారంభం తో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని అభినందిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version