Site icon Prime9

CM KCR : సీఎం కేసీఆర్ వరాల జల్లు.. టీఎస్ ఆర్టీసీ విలీనం, మెట్రో విస్తరణ.. పలు విషయాల గూర్చి స్పెషల్ స్టోరీ !

telangana cabinet under CM KCR leadership taken several new decisions

telangana cabinet under CM KCR leadership taken several new decisions

CM KCR : కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. వీటిలో ప్రధమంగా టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, మెట్రో విస్తరణ, ఎయిర్ పోర్టు అభివృద్ధి ఇలా అనేక కీలక విషయాలకు తెలంగాణ మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటి వాటి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

టీఎస్ ఆర్టీసీ విలీనం.. 

తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం కార్పొరేష‌న్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీఎస్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న సుమారు 43,373 మంది ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మార‌నున్నారు. ఇక వీరికి కూడా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా పీఆర్సీని, ఇత‌ర అల‌వెన్సుల‌ను అందించ‌నున్నారు. కాగా ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇదని ఆయన తన ట్విటర్ వేదికగా వెల్లడించారు.

మెట్రో విస్తరణ.. 

ప్రస్తుతం హైదరాబాద్ లోని ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని.. భవిష్యత్తులో మరింత మెరుగైన రవాణా సౌలభ్యం కోసం రూ. 69,100 కోట్ల వ్యయంతో మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో ఇప్పటికే రెండు దశల్లో మెట్రో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు 69 కిలో మీటర్లు పొడవు ఉంది. ఎయిర్ పోర్టు మెట్రో పూర్తయితే 105 కిలో మీటర్లకు చేరుతుంది. తాజాగా మూడో దశలో రూ.69,100 కోట్లతో సుమారు 278 కిలోమీటర్లు పొడువున మెట్రో నిర్మాణానికి సీఎం కేసీఆర్ (CM KCR) ఒకే చెప్పారు. ప్రస్తుతం ఉన్న మెట్రోకాకుండా మూడో దశలో కొత్తగా ఎనిమిది మార్గాలతో పాటు ఔటర్ వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించనున్నారు.

అయితే మొత్తం తొమ్మిది మార్గాల్లో మెట్రో నిర్మాణం జరగనుంది. ఇస్నాపూర్ – మియాపూర్, మియాపూర్ – లక్డీకపూల్, ఎల్బీనగర్ – పెద్ద అంబర్ పేట, ఉప్పల్ – బీబీ నగర్, ఉప్పల్ – ఈసీఐఎల్, ఎయిర్ పోర్టు – కందుకూరు(ఫార్మాసిటీ), శంషాబాద్ – షాద్ నగర్ మార్గాల్లో ఈ మెట్రో నిర్మాణంకు ప్రభుత్వం నిర్ణయించింది.

జేబీఎస్ – తూంకుంట, ప్యాట్నీ – కండ్లకోయ ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ (రెండు అంతస్తుల వంతెనలు) నిర్మిస్తారు. ఒక వంతెనను మెట్రో రైలుకు.. మరో వంతెనను వాహనాలకు కేటాయించనున్నారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రకటన.. 

అదే విధంగా కొత్తగా గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను ఖరారు చేసినట్లు వివరించారు. ఎస్టీ కోటా నుంచి కుర్రా సత్యనారాయణను ఖరారు చేయగా.. బీసీ కోటా నుంచి దాసోజు శ్రవణ్‌ కు అవకాశం ఇచ్చారు.  ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కేబినెట్ తీర్మానం చేయగా.. వెంటనే తమ ప్రతిపాదనలను తమిళిసైకి పంపుతామని తెలిపారు.

మిగతా నిర్ణయాల వివరాలు.. 

జులై 18 నుంచి 28 వరకు కురిసిన‌ వర్షాలు, వరదల వల్ల స‌ర్వం కోల్పోయిన వారికి సాయం చేసేందుకు త‌క్ష‌ణం రూ.500 కోట్లు విడుదల.

అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆర్ఫన్‌ పాలసీ

బీడీ కార్మికులతో పాటు బీడీ టేకేదారులకు పింఛన్లు

రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి.

హైదరాబాద్‌లో హైబ్రిడ్‌ విధానంలో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు

నిమ్స్‌లో రూ.1800 కోట్లతో మరో 2 వేల పడకల ఏర్పాటు

Exit mobile version