Telangana Bhavan: తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా దశాబ్థి వేడుకలు నిర్వహించుకుంటోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. తెలంగాణ భవన్ పార్కింగ్ దగ్గర యువతి విషం తాగింది. దీంతో ఆమెను తెలంగాణ భవన్ సిబ్బంది హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఫొటోలను మార్ఫింగ్ చేసి(Telangana Bhavan)
కాగా, ఎమ్మెల్యే చిన్నయ్య తనను మానసికంగా, లైంగికంగా, ఆర్థికంగా వేధిస్తున్నాడని బాధితురాలు రెండు రోజుల క్రితం ఎన్‌హెచ్ఆర్‌సీ, జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఎమ్మెల్యే అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు లో పేర్కొంది. ఎమ్మెల్యే, అతని అనుచరుల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు యువతి లేఖలో వెల్లడించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపింది. తన చావు తర్వాత అయినా తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని లేఖలో యువతి వెల్లడించింది.
ప్రభుత్వం పట్టించుకోలేదని(Telangana Bhavan)
ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు సందర్భంగా యువతి తెలంగాణ భవన్‌కు వచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ సెహ్జెల్ ఢిల్లీకి వచ్చింది. మొదటి రోజు కొత్త పార్లమెంట్ భవనం ముందు నిరసన తెలిపింది. ఆ తర్వాత జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు జంతర్ మంతర్ వద్ద.. గురువారం ఇండియాగేట్ వద్ద నిరసన చేపట్టింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తే ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేసింది.