Telangana Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు జరుగుతుంటాయి. మొన్న మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మధ్య పలకరింపుల
సన్నివేశం బాగా ఆకట్టుకుంది.
అదే విధంగా సోమవారం బడ్జెట్ (Telangana Assembly) ప్రవేశపెట్టడానికి ముందు ఇంకో సన్నివేశం చోటు చేసుకుంది.
అది ఏటంటే.. ఎల్పీ కార్యాలయాలు బిల్డింగ్ వైపు ఈటెల వెళ్తుండగా.. దూరం నుంచి ఈటెలను చూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనను పలికరించారు.
అయితే ఈటెల చూడక పోవడంతో దగ్గరకు వెళ్లి మరీ జనార్దన్ రెడ్డి విష్ చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్, మర్రి జనార్దన్ రెడ్డి మధ్య అసక్తి కర సంభాషణ జరిగింది.
ఈటెల మాట్లాడుతూ.. ‘ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను విష్ చేసే దైర్యం చేస్తారా..?’అనగా.. రాజకీయాలు వేరు మానవ సంబంధాలు వేరని జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
ఆ తర్వాత ఈటెలను ఆలింగనం చేసుకున్నారు మర్రి జనార్దన్ రెడ్డి. అసలు ఇప్పుడు విలువలు ఎక్కడున్నాయని ఈటెల వ్యాఖ్యానించారు.
వేడి నూనెలో వేయించి ఎలా ఉందని అడిగినట్లు ఉందని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఇద్దరి మాట్లాడుతుండగా అక్కడే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రియాక్ట్ అవుతూ.. వేర్వేరు పార్టీల నేతలు మాట్లాడుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.
‘నేను పనుల కోసం హరీష్ రావును కలిస్తే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మీడియాలో వస్తుందన్నారు.
అక్బరుద్దీన్ మిత్రులకు కేటీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. వారి పని చేయడం సాధ్యం కాదని కేటీఆర్ మొహం చాటేస్తున్నారని తెలిపారు.
దాంతో అక్బరుద్దీన్ కు మండి అసెంబ్లీలో కేటీఆర్ పై ఘాటుగా మాట్లాడారని రఘునందన్ రావు పేర్కొన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
హరీష్ బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత శాసనసభ వాయిదా పడింది.
బుధవారం ఉదయం 10 గంటలకు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/