Teacher Transfers: టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్ టైటిల్ మెంట్ పాయింట్ల ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలకు(Teachers
Transfers) సీనియారిటీ జాబితా , పదోన్నతుల కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితాలను మంగళవారం విడుదల కావాల్సిఉంది.
కానీ ఆ వివరాలను వెల్లడించవద్దని ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ దేవసేన ఆదేశించారు.
అంతే కాకుండా ఉపాధ్యాయ ఖాళీల జాబితాను కూడా ప్రకటించవద్దని ఆర్ జేడీ, డీఈఓలకు సూచించారు.
కోర్టు తీర్పుతో ఆగిన బదిలీలు (Teachers Transfers)
317 జీవో ద్వారా కొత్త జిల్లాలకు వెళ్లిన టీచర్లకు బదిలీ అవకాశం లేకుండా, రెండేళ్ల కనీస సర్వీసు నిబంధన పెడుతూ తెలంగాణ విద్యాశాఖ ఇటీవల జీవో ఇచ్చింది.
అయితే ఆ జీవో ను సవాల్ చేస్తూ కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు.
దీంతో మంగళవారం విడుదల చేయాల్సిన బదిలీల జాబితాను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత.. దానిపై అప్పీల్ కు వెళ్లాలా? లేదా తీర్పును అమలు చేయాలా అనేది నిర్ణయిస్తారని సమాచారం.
బదిలీల ప్రక్రియ మరింత ఆలస్యం (Teachers Transfers)
తాజా పరిణామం వల్ల టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
317 జీవో ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు.
ఒక వేళ అది జరిగితే మరో 15 వేల మంది టీచర్లు బదిలీ దరఖాస్తు చేసుకుంటారిని అంచనా వేస్తున్నారు.
బదిలీల ప్రక్రియ జనవరి 28 న ప్రారంభమైంది. దాదాపు 59 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే వారిలో ఎవరైనా కోర్టుకు వెళితే సమస్య మరింత కష్టమవుతుంది. ఒక వేళ అంతా సవ్యంగా జరిగితే బదిలీల ప్రక్రియ మరో రెండు నెలలు పట్టే అవకావం ఉంది.
ఈ లోపల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ వస్తే బదిలీల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/