Prime9

Tammineni Krishnaiah Murder Case: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు.. కోర్టులో లొంగిపోయిన తమ్మినేని కోటేశ్వరరావు

Khammam: టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటు ఎల్లంపల్లి నాగయ్య ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య జరిగినప్పటి నుంచి వారిద్దరు పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆగష్టు 15న బైక్ పై వెళ్తున్న తమ్మినేని కృష్ణయ్య ను దండగులు కిరాతకంగా పొడిచి చంపారు. కోటేశ్వరరావుతో విభేధాలు రావడంతో కృష్ణయ్య సీపీఎంనుంచి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అనుచరుడిగా కొనసాగారు. తన తండ్రి హత్యకు కోటేశ్వరరావు సహా ఆరుగురు వ్యక్తులు కారణమని కృష్ణయ్య కొడుకు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Exit mobile version
Skip to toolbar