Site icon Prime9

School Boy : మేడ్చల్ జిల్లాలో దారుణం.. స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్ధికి తీవ్రగాయాలు

swamy narayana gurukul school boy severly injured in funtion

swamy narayana gurukul school boy severly injured in funtion

School Boy : మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాలకు చెందిన స్వామి నారాయణ గురుకుల స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి తీవ్ర గాయలయ్యాయి. స్కూల్లో గతనెల 11తేదీన వార్షికోత్సవ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో విన్యాసాలు చేయించారు. ఈ క్రమంలోనే హానివర్ధన్ రెడ్డి అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో యాజమాన్యం వైద్యానికయ్యే ఖర్చును భరిస్తామని ఒప్పుకొంది. ఇప్పుడు వైద్యం చేయించకుండా బెదిరింపులకు పాల్పడుతుందని తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

Exit mobile version