Site icon Prime9

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో స్టే ఎత్తివేత.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు

High Court

High Court

Hyderabad: మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుల దర్యాప్తు పై విధించిన స్టే ఎత్తివేసింది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు ద‌ర్యాప్తు చేసుకోవ‌చ్చ‌ని కోర్టు ఆదేశించింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏపీకి చెందిన సింహయాజీ, హైద్రాబాద్ కు చెందిన నందకుమార్ లు తమను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 26వ తేదీ రాత్రి రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపుర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులను పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టారని పోలీసులు తెలిపారు.

Exit mobile version