Site icon Prime9

Jangaon: జనగామలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై దంపతులు

janagam

janagam

Jangaon: జనగామ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్సై దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఎస్సై దంపతుల ఆత్మహత్య (Jangaon)

జనగామ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్సై దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. తొలుత ఎస్సై భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత గంట వ్యవధిలోనే.. ఎస్సై కూడా తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. ఒకేసారి ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబలో తీరని విషాదం నింపింది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ పట్టణంలో.. కాసర్ల శ్రీనివాస్ ఎస్ఐ గా ఎనిమిదేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.

ఉదయం ఆయన భార్య బాత్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించేలోపే ఆమె విగతజీవిగా కనిపించారు.

విషయం తెలుసుకున్న బంధువులు ఇంటికి వచ్చి ఎస్సై శ్రీనివాస్‌ను పరామర్శించారు.

ఆ తర్వాత ఏసీపీ, సీఐ నాగబాబు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

అప్పటి వరకు బెడ్ రూమ్ లో ఉన్న ఎస్సై.. బాత్ రూమ్ కి వెళ్తున్నట్లు చెప్పి తన రివాల్వార్ తో కాల్చుకున్నారు.

కాల్పుల శబ్దం విని ఏసీపీ, సీఐ బాత్ రూమ్ కి వెళ్లి చూడగా.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

రాత్రి ఏం జరిగిందంటే..

ఈ ఘటనపై డీసీపీ సీతారామ్ మీడియాకు పలు వివరాలను వెల్లడించారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారని.. వారు హైదరాబాద్‌లో ఉంటున్నారని తెలిపారు.

దంపతుల మధ్య.. ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగిందన్నారు. ఎస్సై దంపతులు ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిగాక మిగిలిన విషయాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు.

Exit mobile version
Skip to toolbar