Site icon Prime9

MLA Jaggareddy: రాజకీయ నేతల షర్ట్ లపై చర్చ

Shirts of political leaders that is becoming a debate

Shirts of political leaders that is becoming a debate

Hyderabad: ఎప్పుడూ తెలుపు షర్ట్ లేదా టీ షర్ట్ తో వచ్చే జగ్గారెడ్డి రెండోరోజు అసెంబ్లీ సమావేశాలకు కెంజో కంపెనీకి చెందిన క్యాజువల్ చొక్కా ధరించి వచ్చారు. చొక్కా ధర ఎంతని జగ్గారెడ్డిని మీడియా ప్రశ్నించడంతో రూ. 35వేలంటూ ఆయన జవాబిచ్చారు. దీంతో అవాక్కయిన మీడియా ప్రతినిధులతో అనుమానం ఉంటే గూగుల్ సెర్చి చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు.

తీరా ఆరా తీస్తే ఆ షర్ట్ ధర నిజంగానే 32వేలుగా ఉండడంతో జగ్గారెడ్డి సంభాషణను పొడిగించారు. కేవలం జీవన్ రెడ్డి, టిఆర్ఎస్ శాసనసభ్యులే వేసుకోవాలా అంటూ సరదా చేసారు. తన కొడుకు షర్ట్ వేసుకొని వచ్చానని చివరకు చెప్పిన జగ్గారెడ్డి, రాజీవ్ గాంధీకి రూ. 40వేల షర్ట్ వేసుకొనే స్తోమత లేదా అంటూ రచ్చ చేస్తున్న భాజాపా నేతలకు చురుకలంటించారు.

మొత్తం మీద నేతల పుణ్యమానంటూ వేలల్లో ఉన్న షర్ట్ ధరలు సామాన్యులకు కూడా తెలిసేలా చేసారు.

Exit mobile version