Site icon Prime9

Terror attack: ఉగ్ర కోణంలో సంచలన నిజాలు.. ఆ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్‌

terrosism

terrosism

Terror attack: హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.

కీలక విషయాలు..

హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.

కస్టడీలో ఉన్న నిందితుల నుంచి పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు. హైదరాబాద్- భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు వీరిని మరింతో లోతుగా విచారణ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని భోజ్ పురా సమీపంలో వారికి శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద వీడియోలు.. కోడ్ భాషలో వున్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వీరు పలు కీలక ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలిసింది.
రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గం లో నిధులు వచ్చినట్టు ఏటీఎస్‌ బృందం గుర్తించింది.

 

Exit mobile version