Site icon Prime9

JP Nadda : కేసీఆర్ సర్కార్ కు గుడ్ బై చెప్పాలి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా

JP Nadda

JP Nadda

JP Nadda : కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని దీనికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షడు జేడీ నడ్డా అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సందర్బంగా కరీంనగర్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడని అతని పాలనలో రాష్ట్రం 3.29 కోట్ల అప్పులకుప్పగా మారిందని ఆరోపించారు.కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుంది.

కేసీఆర్ బిడ్డ కవిత అవినీతి లో కూరుకుపోయింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ తరువాత వీఆర్ఎస్ గా మారకతప్పదన్నారు.ధరణి పోర్టల్” పేరుతో బీఆర్ఎస్ నేతలు పేదల భూములను గుంజుకుంటున్నారని నడ్డా మండిపడ్డారు. ఓవైసీ కి భయపడే..సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం గా కేసీఆర్ జరపడం లేదని ఎద్దేవా చేసారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలి. తెలంగాణ అభివృద్ధి ని కోరుకునే ప్రతి ఒక్కరూ. బీజేపీ తో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నానని నడ్డా అన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ నగర్ గడ్డపై గర్జించి, గాండ్రిస్తే. వాళ్ళకి వణుకు పుట్టాలని అన్నారు. ఈ గ్రౌండ్ లో పౌరుషం, ఆవేశం ఉంది నేను ఇక్కడే పెరిగాను. దుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదం తోనే నేను బతికిన. మీకు సేవ చేసే భాగ్యం కలిగింది.నేను ముందు ఈ డివిజన్ కార్పొరేటర్ ను.2014 లో నాకు ఎమ్మెల్యే గా 52 వేలకుపైగా ఓట్లు ఇచ్చారు.కరీంనగర్ గడ్డ నన్ను ధర్మం కోసం పనిచేయమంది. ధర్మం కోసం యుద్ధం చేయమంది ఈ కరీంనగర్ గడ్డ.హిందూ ధర్మ రక్షణ కోసమే పనిచేస్తున్నా.మీరు గర్వపడేలానేను పనిచేస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ అంటే… బంధిపోట్ల రాష్ట్ర సమితి, బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని సంజయ్ ఎద్దేవా చేసారు. గుంటనక్కలు అంతా ఏకమయ్యాయని అయితే మోదీ సింహమని సింగిల్ గానే వస్తారని అన్నారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ నన్ను వెంటాడి, వేటాడి నా మీద నిలబడతా అన్న కవిత.. ఇప్పుడు అయ్య ఎక్కడ చెప్తే అక్కడే అంటోంది.నా మీద కవిత నిలబడాలా..? లేదా?నీకు భయం ఉంటే… నువ్వు నిలబడు, లేకపోతే నాపై మీ అయ్యను నిలబెట్టు అని ఛాలెంజ్ చేసారు. ఎలక్షన్స్ లో పెట్టే ఖర్చును రూ.100 ల కోట్లకు తీసుకెళ్లింది ఈ బీర్ఎస్ పార్టీ అని అరవింద్ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, ఈ ముగింపు సభను పెట్టుకున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల రక్తపు చుక్కల మీద లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మొన్నటి వరదకి, మోటార్లు మునిగిపోయాయి.కన్నెపల్లి పంపు హౌజ్ లో 18, అన్నారం లో 12 పంపులు మునిగాయి.నేను చెప్పేది తప్పైతేఈ కాలేజ్ గ్రౌండ్ కి వచ్చి సమాధానం చెప్పు కేసీఆర్ అంటూ రాజేందర్ సవాల్ చేసారు.

Exit mobile version