Site icon Prime9

Revanth Reddy: రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు భారీ ప్రమాదం.. 6 కార్లు ఒకదానికొకటి ఢీకొని

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్యాయ్ కు భారీ ప్రమాదం జరిగింది. అతి వేగంగా కాన్వాయ్ రావడంతో 6 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి.

రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని 4 కార్లతో పాటు 2 న్యూస్ ఛానళ్ల కార్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. పలువురు రిపోర్టర్లకు స్వల్పంగా గాయాలైనట్టు సమాచారం.

ప్రమాద సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో గాయపడిన రిపోర్టర్లను, రేవంత్ రెడ్డి వ్యక్తి గత సిబ్బందిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.

రేవంత్ రెడ్డి శ్రీ పాద ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

అదనపు భద్రత కోసం పిటిషన్(Revanth Reddy)

పాదయాత్ర సందర్భంగా అదనపు భద్రత కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజకీయ పోరాటం చేస్తున్న రేవంత్‌(Revanth Reddy) పై పాదయాత్రలో దాడులు జరిగే అవకాశం ఉన్నందున.. అదనపు భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

రేవంత్‌ యాత్రకు వెళ్లే ప్రతిచోట భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీపీ ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారని ప్రభుత్వ న్యాయవాది వివరించారు.

జిల్లాల ఎస్పీలకు పంపిన సమాచారాన్ని ఈ సందర్భంగా న్యాయమూర్తికి అంద జేశారు.

పరిశీలించిన న్యాయమూర్తి ఈ పిటిషన్‌లో ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదన్నారు.

అయినా అదనపు భద్రత కల్పించారా.. లేదా.. అన్న విషయాన్ని చెప్పాలని రేవంత్‌రెడ్డిని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Exit mobile version