Site icon Prime9

Rajanna Sircilla Collector: ట్విట్టర్ లో నెంబర్ వన్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్

Rajanna-Sircilla-district-Collector-top-in-twitter

Rajanna Sircilla district: ట్విట్టర్ లో తెలంగాణకు చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మొదటి స్థానంలో నిలిచారు. ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఫాలోవర్ల ప్రాతిపదికన రూపొందించిన జాబితాలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక ట్విట్టర్ తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది.

కలెక్టర్ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను ప్రస్తుతం 20 వేల 200 మంది అనుసరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 5.4 లక్షల జనాభాకుగాను ప్రతి వెయ్యి మందిలో 37 మంది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవుతున్నారు. సంఖ్య పరంగా చూసుకుంటే అత్యధిక మంది అనుసరించే ట్విట్టర్ ఖాతాల జాబితా లో వైశాల్యం, జనాభా పరంగా చిన్న జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల రెండో స్థానంలో ఉండడం విశేషం.

ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు,మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇతర వీఐపీల పర్యటనల వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం, ప్రజా ఫిర్యాదుల త్వరితగతిన స్పందిస్తుండడంతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అధికారిక ట్విట్టర్ ఖాతాను అనుసరించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొదటి నుంచి ప్రథమ స్థానంలో ఉంటూ వస్తున్న కలెక్టర్ ట్విట్టర్ ఖాతా తాజాగా 20 వేల మైలు రాయిని చేరుకుంది.

Exit mobile version