Rain: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో పాటు.. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో పాటు.. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షం పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
తమిళనాడు-కర్ణాటక మీదుగా ఉత్తరాది వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈదురు గాలులతో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ లలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడింది. బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షం కారణంగా మలక్‌పేట తదితర ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్రకు కొద్దిసేపు ఆటంకమేర్పడింది.
పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగింది.
మరోసారి వర్షాలు పడితే.. మరింత నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని కోరుతున్నారు.