OMR Sheet: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగిస్తోంది. ఇక గ్రూప్ 1 రాసిన ప్రవీణ్.. కావాలనే తనకు తాను డిస్ క్వాలిఫై చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానం రాకుండా ఉండేందుకే నిందితులు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
భయపడి.. డిస్‌క్వాలిఫై (OMR Sheet)
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగిస్తోంది.
ఇక గ్రూప్ 1 రాసిన ప్రవీణ్.. కావాలనే తనకు తాను డిస్ క్వాలిఫై చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానం రాకుండా ఉండేందుకే నిందితులు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ప్రశ్నపత్రం కొట్టేసిన వీరు.. పరీక్ష రాయడంలోనూ తెలివితేటలు ప్రదర్శించారు. అత్యధిక మార్కులు సాధిస్తే అందరి కళ్లూ తమపైనే పడతాయని, అసలుకే ఎసరు వస్తుందని వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అధిక మార్కులు వస్తే.. ఎక్కడ దొరికిపోతామో అని పథకం ప్రకారం నడుచుకున్నారు. అధిక మార్కులు కాకుండా.. మంచి మార్కులతో సరిపెట్టుకున్నారు.
ఇక గ్రూప్ 1 లో 103 మార్కులు తెచ్చుకున్న ప్రవీణ్..
వ్యక్తిగత వివరాలు నింపే పత్రంలో డబుల్ బబ్లింగ్ చేయడం కూడా దీనిలో భాగమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెందిన 20 మంది ఉద్యోగులు.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. ఇందులో 8 మంది క్వాలిఫై అయ్యారు.
వీరిలో షమీమ్, సురేష్, రమేష్‌లకు వందకుపైగా మార్కులు వచ్చాయి. షమీమ్‌కు అత్యధికంగా 127 మార్కులు వచ్చాయి.
ఈ ముగ్గురూ ప్రవీణ్, రాజశేఖర్‌ల ద్వారా ప్రశ్నపత్రాన్ని ముందుగానే పొందారన్న ఆరోపణపై సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
పరీక్షకు ముందే వీరికి ప్రశ్నపత్రం అందినందున.. వీరు 150కి 150 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది.
అయితే దొరికిపోతామన్న ఉద్దేశంతో కొంచెం తక్కువ మార్కులు వచ్చేలా రాశారని పోలీసులు భావిస్తున్నారు.
నిబంధనల మేరకు ఎవరికైనా వందశాతం లేక అసాధారణ స్థాయిలో మార్కులు వస్తే వారిపై విచారణ చేయడంతోపాటు అవసరమైతే పోలీసులతోనూ దర్యాప్తు చేయిస్తారు.
ఈ నిబంధన కమిషన్‌లో పనిచేస్తున్న ఆ ముగ్గురుకీ తెలుసు. వీరికి గరిష్ఠంగా మార్కులు వస్తే కమిషన్ అధికారులకూ అనుమానం వచ్చే అవకాశం ఉంది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయి. కానీ అతడి ఓఎంఆర్ షీట్ లో డబుల్ బబ్లింగ్ చేయడంతో అనర్హుడయ్యాడు. కానీ ఇప్పుడు ఇదే అనేక అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష ప్రారంభానికి ముందే.. ఓఎంఆర్ నింపవలసి ఉంటుంది. అది అయ్యాకే.. ఇన్విజిలేటర్ సంతకం చేస్తారు. ఇలా ఎవరైన తప్పు చేస్తే.. అది గుర్తించి వారికి ఇంకొక ఓఎంఆర్ అందిస్తారు. కానీ ప్రవీణ్ పరీక్ష రాయడానికి ముందే తప్పుగా నింపి ఉంటే ఇన్విజిలేటర్‌కు తెలిసిపోయేది. అప్పుడు ఇంకోటి ఇచ్చేవారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. అంటే తొలుత ప్రవీణ్ ఓఎమ్మార్ షీట్ బాగానే నింపి ఉంటాడు. పరీక్ష పూర్తయ్యాక.. తనకు ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి.. అంతా అనుమానించే అవకాశం ఉందని భయపడి, తనకు తాను డిస్‌క్వాలిఫై అయ్యేలా ఓఎమ్మార్ షీట్‌లో మరోమారు బబ్లింగ్ చేసి ఉంటాడని భావిస్తున్నారు.