Site icon Prime9

MLA Guvvala Balaraju: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి వ్యతిరేకంగా పోస్టర్లు

Balaraju

Balaraju

Achampet: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. వీరు ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. మరోవైపు ఈ నలుగురిలో ఒకరైన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అచ్చంపేట ఆత్మగౌరవంను రూ.100 కోట్లకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమ్ముకున్నాడు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్లారా, యువకుల్లారా, మేధవుల్లారా, విద్యావంతుల్లారా ఒక్కసారి ఆలోచించండి. ఎటుపోతుంది మన అచ్చంపేట ఆత్మగౌరవం’ అంటూ పోస్టర్లలో కనిపిస్తోంది. ‘ఎమ్మెల్యేను అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరిమికొడదాం. మన అచ్చంపేట ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం’ అంటూ పోస్టర్లలో ఉంది. నియోజకవర్గంలో పలు సందర్భాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫొటోలను ఈ పోస్టర్లలో పొందుపర్చారు. వికలాంగుడు శ్రీను పై దాడి, గిరిజన సర్పంచ్‌ పై దాడి, ఎమ్మెల్యే ఆఫీస్‌ను ముట్టడించిన కార్యకర్తల పై రాళ్ల దాడి ఘటనలను పోస్టర్లలో ప్రస్తావించారు.

అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ల ఫై స్థానిక టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోన్నారు. ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా పోస్టర్లు ఏర్పాటు చేస్తోన్నారని ఆరోపిస్తోన్నారు.

 

Exit mobile version