Site icon Prime9

Ponguleti: కేసీఆర్ పై పోటీ చేస్తా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ponguleti

ponguleti

Ponguleti: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తే.. తాను కూడా బరిలో ఉంటాటని స్పష్టం చేశారు. కేసీఆర్ ను గద్దే దించడమే తమ లక్ష్యమని పొంగులేటి అన్నారు. ఈ మేరకు ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సంచలన వ్యాఖ్యలు.. (Ponguleti)

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తే.. తాను కూడా బరిలో ఉంటాటని స్పష్టం చేశారు. కేసీఆర్ ను గద్దే దించడమే తమ లక్ష్యమని పొంగులేటి అన్నారు. ఈ మేరకు ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పొంగులేటి, జూపల్లితో భాజపా నాయకులు సుదీర్ఘ మంతనాలు జరిపారు. భాజపాలో చేరే విషయంపై ఇప్పుడే ఏం చెప్పలేమని తెలిపినట్లు సమాచారం.

బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లి ఇంకా ఏ పార్టీలో చేరతారనేది స్పష్టంగా తెలియాదు. అయితే వీరిని తమవైపు తిప్పుకోవాలని భాజపా యోచిస్తోంది.

అందులో భాగంగానే.. భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ బృందం ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో సుదీర్ఘంగా మంతనాలు సాగించింది.

ఈ భేటీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరయ్యారు. వీరితో పాటు.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా హాజరయ్యారు.

ఈ మేరకు వీరికి పొంగులేటి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.

సుదీర్ఘ చర్చ..

పొంగులేటి నివాసంలో ఈ నేతలు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. సుమారు 5 గంటల పాటు.. వివిధ విషయాలపై చర్చించారు. ఈ మేరకు వారిద్దరని భాజపాలోకి ఈటల ఆహ్వానించారు.

పార్టీలో చేరితే అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి చేరితే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ లో భాజపా బలం పెరుగుతుందని భావిస్తున్నారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ వ్యతిరేక శక్తుల్ని ఏకంచేసి భారాస ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని శక్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పొంగులేటి, జూపల్లి చెప్పినట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ను దించడమే ఎజెండా

స్వార్థం, స్వలాభం కోసమే పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపడమే మా లక్ష్యం. ఇదే ఎజెండాపై భాజపాలో చేరాలని గతంలో దిల్లీ పెద్దలు కోరారు.

ఇప్పుడు రాష్ట్ర నేతలు కలిశారు. పిలిచిందే తడవుగా నిర్ణయం తీసుకోలేం. సీట్లు, పదవులపై ఎలాంటి చర్చ జరగలేదు.

ఖమ్మం ఎంపీగా కేసీఆర్‌ పోటీచేస్తే కచ్చితంగా నేనే బరిలో ఉంటానని పొంగులేటి స్పష్టం చేశారు.

Exit mobile version